రామప్ప శిల్పకళ అద్భుతం

25 Mar, 2015 01:27 IST|Sakshi
రామప్ప శిల్పకళ అద్భుతం

 సాక్షి, హన్మకొండ: చారిత్రక రామప్ప, భద్రకాళి ఆలయాల సందర్శన, మిషన్ కాకతీయ లో భాగంగా చేపట్టిన చెరువు పూడికతీత పనుల పర్యవేక్షణలతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వరంగల్ పర్యటన మొదటిరోజు విజయవంతంగా ముగిసింది.  మంగళవారం ఉదయం  గవర్నర్ దంపతులు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా వరంగల్‌కు చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు జిల్లా అధికారులు హరిత కాకతీయ హోటల్‌లో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వరంగల్  నగరంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని గవర్నర్ దంపతులు మొదటగా దర్శించుకున్నారు.

మధ్యాహ్న భోజన విరామం అనంతరం మిషన్‌కాకతీయలో భాగంగా దుగ్గొండి మం డలం ముద్దనూరులోని పెద్దచెరువు, నల్లబెల్లి మండలం శనిగరం గ్రామాల చెరువుల్లో పూడికతీత పనులను పరిశీలించారు. చెరువు మట్టిని తీసుకెళ్తున్న రైతులతో స్వయంగా మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పను ల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాలని సూచిం చారు. అనంతరం అక్కడి నుంచి రామప్ప ఆలయానికి వెళ్లారు. సాయంత్రం నగరం లోని ఖిల్లాకు చేరుకొని కాకతీయ కీర్తితోర ణాలను పరిశీలించారు. నేటి ఉదయం వేయిస్తంభాల గుడిని సందర్శించుకోవడంతో గవర్నర్ రెండురోజల పర్యటన ముగుస్తుంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు