తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దుదాం

24 Jul, 2018 11:14 IST|Sakshi
ఆలయం వద్ద మొక్క నాటుతున్న ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, అధికారులు

మక్తల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో అందరూ పాల్గొనడం ద్వారా రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం మాద్వార్‌లోని శ్రీగట్టు తిమ్మప్ప దేవాలయం ప్రాంగణంలో సోమవారం ఆయన మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్క లు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేతో పాటు సబ్‌కలెక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతును సన్మానించారు.

మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్, ఎఫ్‌ఆర్వో నారాయణరావు, ఏపీడీ చంద్రశేఖర్, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఎంపీడీఓ విజయనిర్మల, హెచ్‌ఎం రాందాస్, సర్పంచ్‌ రాధమ్మ, ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డితో పా టు రాజేశ్వర్‌రావు, సంతోష్‌రెడ్డి, రాంలింగం, ఈ శ్వర్, విశ్వనాథ్, ఆశప్ప, రాజమహేందర్‌రెడ్డి, నే తాజీరెడ్డి, శ్రీనివాసులు, కాషయ్య పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు