టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. అవినీతిలో కూరుకుంది

10 Oct, 2017 13:38 IST|Sakshi

తిరుమలగిరి (తుంగతుర్తి) : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతు న్న భాష వింటుంటే తెలంగాణ రాష్ట్రం పరువు పోతుందన్నారు. జేఏసీ చైర్మన్‌ కోదండరాంను విమర్శించడం అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ కషి చేసిందని అన్నారు.

తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూజేఏసీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేస్తుంటే రా ష్ట్ర ముఖ్యమంత్రి డీఎస్సీ గురించి హేళనగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన అహంకారం పతనానికి పునాదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సాధిస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాం రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, చెవిటి వెం కన్న, డాక్టర్‌ వడ్డెపల్లి రవి, గుడిపాటి నర్సయ్య, ఎస్‌.కొండల్‌రెడ్డి, రాంబాబు, చంద్రశేఖర్, జాటోతు సోమన్న, విశ్వేశ్వర్, నరేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు