రాములు నాయక్‌, యాదవరెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురు..

10 Jul, 2019 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనర్హతకు గురైన ఎమ్మెల్సీలు రాములు నాయక్‌, యాదవరెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై అనర్హత వేటు వేయడంపై రాములు నాయక్‌, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. రాములు నాయక్‌, యాదవరెడ్డిలను అనర్హులుగా పేర్కొంటూ శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని కోర్టు తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది.. తాము సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల సంఘానికి తెలపాలని ఈసీ తరఫు న్యాయవాదికి సూచించింది.

మరిన్ని వార్తలు