ఈద్ ముబారక్

30 Jul, 2014 02:14 IST|Sakshi
ఈద్ ముబారక్

జిల్లావ్యాప్తంగా మంగళవారం రంజాన్ కోలాహలం నెలకొంది.. ముస్లింలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు.. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు..

మసీదులు ముస్లింలతో కిక్కిరిశాయి.. ముస్లిం మతగురువులు మహ్మద్ ప్రవక్త సందేశాలు బోధించారు.. ప్రవక్త సందేశాలు అనుసరించి, ఆచరించాలన్నారు. దైవానుసారంగా జీవించిన వారికి అల్లాహ్ కరుణ లభిస్తుందన్నారు.. ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.. ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు..
 
రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కొత్త దుస్తులు ధరించి చిన్నా, పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహ్మద్ ప్రవక్త సందేశాలను బోధించారు. సక్రమార్గంలో నడిచే వారికే అల్లాహ్ కరుణ లభిస్తుందని సందేశం ఇచ్చారు. తదుపరి ఒకరి నొకరు అలాయ్‌బలాయ్ ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపు కున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, గుడిహ త్నూర్‌లో ఎంపీ నగేష్, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు మసీదులకు వచ్చి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యంతం జిల్లా అంత టా రంజాన్ పండుగ వాతావరణం కనిపించింది.

మరిన్ని వార్తలు