లైన్‌మేన్‌ సతాయిస్తుండు!

14 May, 2020 12:05 IST|Sakshi
ఎండిన పంటను చూపిస్తున్న రైతు అంకం వెంకటయ్య

వారంరోజులుగా ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఇవ్వని వైనం  

రంగారెడ్డిపల్లి రైతుల ఆవేదన    

గండేడ్‌: వెన్నాచేడ్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీప  చిన్నవాగు సమీపంలో 10మంది రైతులు కలిసి పొలాలకు నీరు మళ్లించేందుకు ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేసుకున్నారు. వారంరోజుల కిందట లోఓల్జేజీ సమస్య చెడిపోయింది. రైతులందరూ కలిసి దాన్ని  తీసుకెళ్లి మరమ్మతు చేయించి తీసుకొచ్చారు. దానికి తిరిగి కనెక్షన్లు ఇచ్చి కరెంట్‌ సరఫరా చేయమని ఎన్నిసార్లు లైన్‌మేన్‌ అచ్చుతారెడ్డిని బతిమాలినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మోటార్లు నడవక పోవడంతో రైతులు సాగుచేసిన పైర్లు ఎండుతున్నాయి.  మూగజీవాలకు నీరు లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని మండల ట్రాన్స్‌ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు