చిన్నారిపై లైంగిక దాడి 

16 Jul, 2019 12:43 IST|Sakshi
నిందితుడు రాయకోటి

 నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు  

సాక్షి, పూడూరు(రంగారెడ్డి): సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఓ 55 ఏళ్ల వ్యక్తి. తన మనవరాలి వయసుండే బాలికకు చాకెట్ల ఆశ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌ గ్రామానికి చెందిన జాండ్ర రాయకోటి(55) కొంతకాలం క్రితం గ్రామం నుంచి వెళ్లి పోయాడు. ఆయనను భార్య, కుటుంబీకులు వదిలేశారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన తిరిగి స్వగ్రామం పెద్ద ఉమ్మెంతాల్‌కు  వచ్చాడు.

స్థానికంగా టీవీలు, ఫ్యాన్ల రిపేరింగ్‌తోపాటు ఎలక్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోని ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి(5)కి తరచూ చాక్లెట్ల ఆశ చూపించి సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మరోమారు రాయకోటి తన ఇంట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడగా తీవ్రరక్తస్రావం అయింది. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.

బాధితురాలి కుటుంబీకులు జరిగిన విషయాన్ని  స్థానికులకు చెప్పడంతో రాయికోటిపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు చన్గోముల్‌ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పరిగి ఠాణాకు తరలించి విచారణ జరిపారు. సోమవారం రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ హఫీజ్, సీఐ మొగులయ్య తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రాయకోటిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి