బాలికపై అత్యాచారం.. నిందితుడి హత్య

12 Jan, 2015 17:41 IST|Sakshi

హైదరాబాద్: అభం శుభం ఎరుగని అమాయక బాలికపై అత్యాచారం చేసి.. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చి తిరుగుతున్న నిందితుడిని బాధితురాలి బంధువులు దాడి చేసి చంపేశారు. హయత్ నగర్ మండలం బలిజగూడలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆరేళ్ల బాలికపై శ్రీను అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక జరిగిన విషయాన్నితన తల్లితండ్రులకు వెల్లడించడంతో వారు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కొంత కాలానికి బెయిల్ పై విడుదలైన శ్రీను.. కొన్నాళ్ల పాటు గచ్చిబౌలిలో గడిపి, తర్వాత మళ్లీ హయత్ నగర్ ప్రాంతానికి వచ్చి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.

విషయం తెలుసుకున్న నిందితురాలి బంధువులు కోపంతో రగిలిపోయారు. ఆవేశంతో బాలిక తండ్రి, మేనమామ, ఇద్దరు చిన్నాన్నలు కలిసి సోమవారం మధ్యాహ్నం శ్రీనుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిందితుడు శ్రీను.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన బాలిక బంధువులు వెంటనే పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.
 

మరిన్ని వార్తలు