చేనేత ఆత్మగౌరవం నిలబెడదాం

12 Feb, 2018 16:47 IST|Sakshi
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్‌

రాజ్యసభ సభ్యుడు రాపోలు  

కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణస్వీకారం

కోరుట్ల: చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో పోరాటం ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచుర్యం కల్పించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాల్లో మార్గదర్శకులుగా ఉన్న పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కోరుట్ల పద్మశాలీ సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యక్తిగత వైషమ్యాలకు తావివ్వకుండా పద్మశాలీల సంక్షేమానికి పూర్తి సమయం ఇవ్వాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణకు అలుపెరగకుండా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు ప్రతీ ఒక్కరు నిరంతరం పాటుపడాలన్నారు. ఐక్యంగా ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపు వస్తుందన్నారు. నూతన అధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పద్మశాలీల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. వారి శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొసికె యాదగిరి, ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్త రమేశ్, నాయకులు వాసం భూమానందం, సదుబత్తుల హరిప్రసాద్, చెన్న విశ్వనాథం, గుంటుక ప్రసాద్, జక్కుల ప్రసాద్, అల్లె సంగయ్య, జిల్లా ధనుంజయ్, వాసాల గణేష్‌లు పాల్గొన్నారు.  

కొత్త పాలకవర్గ ప్రమాణస్వీకారం
పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా గుంటుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రుద్ర సుధాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జిందం లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆడెపు నరేష్‌కుమార్, యువత అధ్యక్షుడిగా అందె రమేష్, ఉపాధ్యక్షుడిగా కటుకం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ప్రవీన్‌కుమార్, సహాయ కార్యదర్శిగా బండి సురేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ్‌కుమార్‌తో ఎన్నికల అధికారులు కాచర్ల శంకరయ్య, మార్గం రాజేంద్రప్రసాద్, కడకుంట్ల సదాశివ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు.      

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ
కోరుట్ల పట్టణంలోని కార్గిల్‌ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు రాపోల్‌ ఆనంద భాస్కర్‌ ఆవిష్కరించారు.   

మరిన్ని వార్తలు