ఉస్మానియాలో అరుదైన శస్త్ర చికిత్సలు

6 Nov, 2018 09:33 IST|Sakshi
బాలిక గొంతులోంచి తొలగించిన బటన్‌ బ్యాటరీ.. బాలిక తేజస్వితో డాక్టర్‌. రమేష్‌

బటన్‌ బ్యాటరీ మింగిన చిన్నారి

రూ.2 నాణేం మింగిన బాలిక

శస్త్ర చికిత్స ద్వారా తొలగింపు..

గ్యాస్ట్రోఎంటరాలాజీ వైద్యుల ఘనత..

అఫ్జల్‌గంజ్‌: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలాజి  హెచ్‌వోడి  రమేష్‌ ఆధ్వర్యంలో సోమవారం వివరాలు వెల్లడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన తేజస్విని (11 నెలలు)  ఆడుకుంటుండగా బటన్‌ బ్యాటరీ నోట్లో పెట్టుకుని మింగేసింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన పాప తల్లి సరస్వతి చిన్నారని వెంటనే నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గ్యాస్ట్రోఎంట్రాలాజి వైద్యులు  గంటపాటు శ్రమించి ప్రత్యేక చికిత్స ద్వారా గొంతులో ఇరుక్కున్న బ్యాటరీని ఎండోస్కోపిక్‌ రిమువల్‌ బాటరి ఇన్‌ ద్వారా తొలగించారు. అలాగే నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన అలిజ (4) ఈ నెల 3న రూ.2 నాణెంతో ఆడుకుంటూ నోటిలో పెట్టుకొని మింగింది. దీనిని గమనించిన ఆమె తండ్రి మహ్మద్‌ ఇంతియాజు బాలికను కింగ్‌కోఠిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు పరీక్షలు చేసి ఎండోస్కోపిక్‌ రిమువల్‌ ఇన్‌ టూ రూపీస్‌ చికిత్స చేసి రెండు  నాణేన్ని బయటికి తీశారు.  వైద్య బృందంలో హెచ్‌వోడి రమేష్‌తో పాటు ఇతర వైద్యులు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు. వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు