తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుకండి

11 May, 2015 02:50 IST|Sakshi
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుకండి

ఎన్నారైలకు రసమయి పిలుపు
రాయికల్: బంగారు తెలంగాణ సాధనలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం కెనడాలోని టొరంటోలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ నైట్-2015 కార్యక్రమంలో రసమయి బాలకిషన్, పారిశ్రామికవేత్త వసంత్‌రెడ్డి, తెలంగాణ డెవలప్‌మెంట్ యూకే అధ్యక్షుడు కాల్వల విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యూరు. ఇందులో రసమయి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నారైలంతా భాగస్వాములై అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు పవన్, వెంకట్, మహేశ్, జితేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు