‘రేషన్‌’ పాట్లు.. 

23 Jan, 2018 16:58 IST|Sakshi

బయోమెట్రిక్‌ తీరుతో ఇక్కట్లు 

సిగ్నల్స్‌ లేక నిరుపయోగంగా ఈపాస్‌ యంత్రం 

గంటల తరబడి నిరీక్షిస్తున్న వినియోగదారులు 

ఇల్లెందు(అర్బన్) ‌: మండల పరిధిలోని పూబెల్లిలో ఎటువంటి సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో చౌకదుకాణానికి పంపిణీ చేసిన ఈపాస్‌ యంత్రాలు పనిచేయడంలేదు. పదిహేను రోజులుగా డీలర్‌ వివిధ ప్రయత్నాలు చేసినా ఎంతకీ ఫలితం లేకుండా పోయింది. 1వ తేదీ నుంచి 15 లోపు సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్‌ 15నాటికి ఒక్కరికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. ఈ దుకాణం పరిధిలో సుమారు 378 తెల్ల రేషన్, అంత్యోదయ కార్డు వినియోగదారులు ఉన్నారు.  విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. సిగ్నల్స్‌ పని చేయకపోతే తాము సరుకులు పంపిణీ చేసేదేలాని అధికారులను ప్రశ్నించారు.

ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఇటీవల రెండు రోజుల క్రితం రికార్డుల్లో వినియోగదారుల వివరాలను నమోదుచేసుకొని పరుకుల పంపిణీ ప్రక్రియను షురూ చేశారు. ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియకపోవడంతో సరుకులు తీసుకోలేదు. స్టాక్‌ దుకాణంలోనే నిల్వ ఉంది. ఎలా పంపిణీ చేయాలో తెలియక డీలర్‌ సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం మూడు రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బయో మెట్రిక్‌ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని  కోరుతున్నారు. ప్రతి నెలా ఇలాగైతే తాము సకాలంలో సరుకులు తీసుకోవడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు 

మరిన్ని వార్తలు