ఎక్కడి నుంచైనా సరుకులు

27 Jul, 2019 09:16 IST|Sakshi

సిటీలో రేషన్‌‘ నేషనల్‌ పోర్టబిలిటీ’ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

పంజగుట్ట రేషన్‌షాపులో ఒకే దేశం–ఒకే కార్డు’ ప్రయోగం  

ఆగస్టు ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్‌ సరుకులు

ట్రయల్‌ రన్‌లో సరుకులు డ్రా చేసిన ఏపీ తెల్లరేషన్‌ కార్డుదారులు

సాక్షి సిటీబ్యూరో :  ప్రజాపంపిణీ వ్యవస్ధలో అమలవుతున్న రేషన్‌ పోర్టబిలిటీలో భాగంగా ‘ ఒకే దేశం.. ఒకే కార్డు’  ప్రయోగం హైదరాబాద్‌  నగరంలో విజయవంతమైంది.  కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం–ఒకే కార్డు’ పేరుతో 2020 జూన్‌ నుంచి అమలు తలపెట్టనున్న‘ నేషనల్‌ పోర్టబిలిటీ‘ విధానాన్ని  శుక్రవారం పౌరసరఫరాల అధికారులు నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని పంజాగుట్ట  ప్రభుత్వ చౌకధరల దుకాణం (750)లో  ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని  తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులైన  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌ రావు ( కార్డు నెం  గిఅ్క 0481025 ఆ0472), విశాఖపట్నం జిల్లా, యలమంచిలికి చెందిన అప్పారావు (కార్డు నంబర్‌  గిఅ్క 034109700550) లబ్ధిదారులు సరుకులను డ్రా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పోర్టబిలిటీ విధానాన్ని  తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లను ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్ర  మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీంతో పౌరసరఫరాల అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించి పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా...ఏ రేషన్‌ షా పు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానం అమలవుతుంది.  హైదరాబాద్, మేడ్చల్, రంగారెడి జిల్లా పౌరసరఫరాల పరిధిలో లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఆహార భద్రత పరిధిలో ఉంటేనే...
కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లబ్ధిదారులు మాత్రమే నేషనల్‌ పోర్టబిలిటీ విధానాన్ని వినియోగించుకోవచ్చు. వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లబ్ధిదారుడి ఆధార్‌ నంబర్‌ అతని రేషన్‌ కార్డుతో సీడింగ్‌ అయి ఉండాలి. ఈ విధానంలో బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేయబడుతుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు

కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

చార్మినార్‌ ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెండ్‌

థర్మల్ విద్యుత్‌లో ‘మేఘా’ ప్రస్థానం

నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?

ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి

ఉప సర్పంచ్‌ నిలువునా ముంచాడు..!

పేదలకు వైద్యం దూరం చేసేలా ప్రభుత్వ వైఖరి

తస్మాత్‌ జాగ్రత్త..!

‘కిషన్‌ది ప్రభుత్వ హత్యే’

లోన్‌ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం

పైసలు లేక పస్తులు 

హామీలను మరిచిన కేసీఆర్‌

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

ఆపరేషన్‌కు సహకరించడం లేదని...

ఫేస్‌బుక్‌ మిత్రుల ఔదార్యం

‘హాజీపూర్‌’ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

శ్రీ చైతన్య.. కాదది.. తేజ

ఇంకా మిస్టరీలే!

ఈ ఆటో డ్రైవర్‌ రూటే సెపరేటు

అతి చేస్తే ఆన్‌లైన్‌కి ఎక్కుతారు.. 

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

ముమ్మాటికీ బూటకమే.. 

పైసలిస్తేనే సర్టిఫికెట్‌! 

వైద్యం అందక గర్భిణి మృతి

పోలీసు పిల్లలకూ ‘జాబ్‌ కనెక్ట్‌’

ఎన్డీ నేత లింగన్న హతం

కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చి..

18మంది పిల్లలు పుట్టాకే కుటుంబ నియంత్రణ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!