రేషన్‌ డీలర్ల అర్ధనగ్న ప్రదర్శన 

4 Jul, 2018 14:08 IST|Sakshi
నిర్మల్‌అర్బన్‌: తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న రేషన్‌ డీలర్లు

నిర్మల్‌అర్బన్‌: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నిర్మల్‌అర్బన్‌ తహసీల్దార్‌ కా ర్యాలయం ఎదుట రేషన్‌డీలర్లు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక, డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా, రెచ్చగొట్టే విధానాలను అవలంభించడం సరికాదన్నారు. సంఘం నాయకులు రాజేందర్, గోపాల్‌దాస్, లింగన్న, రమణ, గంగాధర్, తదితరులున్నారు.

సోన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్‌ డీలర్లు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రేషన్‌డీలర్లు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంతుల రాజేందర్, డీలర్లు దశరథ్, రామన్న, రాజు, గండయ్య తదితరులు పాల్గొన్నారు.
    
ఒంటి కాలిపై నిరసన.. 
లక్ష్మణచాంద: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల రేషన్‌డీలర్లు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటి కాలిపై నిల్చొని నిరసనను తెలిపారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ఓస మల్లయ్య, సభ్యులు మోహన్, రాజేశ్వర్, శ్రీనివాస్, రాజాగౌడ్, ప్రతాప్‌రెడ్డి , మరియా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు