నగదు బదిలీకి వ్యతిరేకంగా రేషన్ డీలర్ల ధర్నా

31 Aug, 2015 22:29 IST|Sakshi

రంగారెడ్డి: నిత్యావసర సరుకుల కొనుగోలుకుగాను లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ కార్డుదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తమిళనాడు రాష్ట్రంలోలాగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డీలర్ల కుటుంబానికి ఇన్సురెన్స్, హెల్త్ కార్డులు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీకి వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు