రేషన్‌ డీలర్ల సమ్మె విరమణ

4 Nov, 2017 11:56 IST|Sakshi

నల్లగొండ : రేషన్‌ డీలర్లు సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డీలర్లు ప్రభుత్వం వైపు నుంచి హామీరావడంతో శుక్రవారం సమ్మె విరమించినట్లు జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు వైద్యుల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండలో సివిల్‌ సప్‌లై గోదాం వద్ద నాలుగో రోజు సమ్మె కొనసాగించిన డీలర్లు ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ నెల 10 నుంచి 14 తేదీ మధ్యలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని వివరించారు. ప్రభుత్వం ప్రకటన మేరకు 14 తేదీలోగా సమస్యల పైన ఎలాంటి హా మీగానీ చర్చలు జరిగని పక్షంలో మళ్లీ సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. 

‘మిర్యాల’లో భారీ ర్యాలీ
మిర్యాలగూడ : డిమాండ్ల పరి ష్కారం కోసం రేషన్‌ డీలర్ల సం క్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్‌ డీలర్లను ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆచరణలో అమలు చేయడం లేదన్నారు.ర్యాలీలో రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు అజీజ్, గజ్జి మధుసుదన్, పగిళ్ల వెంకటేశ్వర్లు, ఉబ్బపల్లి కాశయ్య, ఉబ్బపల్లి వెంకటేశ్, దైద మనోహర్, బడుగుల లింగయ్యయాదవ్, సుధాకర్‌రెడ్డి, గందె నాగేశ్వర్‌రావు, నూకపంగ సోమ య్య, విజయలక్ష్మి, మణెమ్మ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు