ఓ వైపు లాక్‌ డౌన్.. మరో వైపు సర్వర్‌ డౌన్

3 Apr, 2020 10:06 IST|Sakshi
బియ్యం కోసం షాపు ఎదుట కూర్చొని వేచి చూస్తున్న మహిళలు ,బస్తీలో కుస్తీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి ఒక్కరికీ పన్నెండు కిలోల ఉచిత బియ్యం కోసం ప్రజలు టోకెన్లు తీసుకుని ఎండను సైతం లెక్క చేయకుండా షాపు వద్ద బారులు తీరారు. కానీ ఈ పాస్‌ యంత్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఒక అధికారి వేలిముద్ర తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించింది. దీంతో చాలా చోట్ల సర్వర్లు మొరాయించాయి. పలు రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీకి మాటిమాటికీ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వేచిఉన్న జనం ఓపిక నశించటంతో  గొడవకు దిగారు. ఎంతకూ సర్వర్‌ పనిచేయకపోవడంతో ఓవైపు లాక్‌ డౌన్, మరోవైపు సర్వర్‌ డౌన్‌ అంటూ నిరాశ వ్యక్త్తం చేస్తూ వెనుతిరిగి వెళ్లిపోయారు.  ఫొటోలు : సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్,సంగారెడ్డి

బస్తీలో కుస్తీ
లాక్‌ డౌన్‌ విధించిన సందర్భంగా సంగారెడ్డిలో ఎవరు కూడా ఇల్లు విడిచి రావొద్దని, బయట తిరగవద్దని పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. అయినా జనాలు మాత్రం వీధుల్లో గుంపులు గుంపులుగా తిరగడం మానలేదు. గురువారం సంగారెడ్డి పాత బస్టాండ్‌ ఎదుట కొంత మంది కొట్టుకున్నారు. ఒకరినొకరు  దూషించుకున్నారు. అందులో ఓ వ్యక్తి తనకన్నా వయసులో చిన్నవారిని వెంబడించి మరీ కొడుతూ కనిపించాడు. వారెంత బతిమిలాడినా వారిని విడిచి పెట్టలేడు. రాళ్లు విసురుతూ వారిని పరుగెత్తించాడు.   – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ , సంగారెడ్డి 

మరిన్ని వార్తలు