అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?

17 Apr, 2019 04:27 IST|Sakshi

అవినీతి గురించి కేసీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటు: మల్లు రవి 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రమే గుర్తుకొచ్చిందా అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిం చింది. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెట్టడం దారుణమని, కేసీఆర్‌ లాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. మాజీమంత్రి డి.కె.సమరసింహారెడ్డితో కలసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అన్ని ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి గెలుపొం దినట్టుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారని, దీనిలో భాగంగానే రెవెన్యూలో అవినీతి అంటూ ఊదరగొడుతన్నా రని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన సైలెంట్‌ ఓటింగ్‌ కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. 

అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
పరిపాలన రంగంపై కేసీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని  డి.కె.సమరసిం హారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడిన తీరు ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కలెక్టర్ల అధికారాలను మంత్రులకు కట్టబెట్టి డమ్మీ మంత్రుల తో పరోక్షంగా తానే అధికారం చలాయించాలని కేసీఆర్‌ చూస్తున్నారన్నారు. సీఎంల ఇష్టానుసారం చట్టా లు చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదని, అలా చేస్తే కాంగ్రెస్‌ ఊరుకోదన్నారు. గతంలో ఎన్టీఆర్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టు చీవాట్లు పెట్టింద ని గుర్తు చేశారు. రెవెన్యూను పంచాయతీరాజ్‌లో విలీనం చేయడమంటే గ్రామాల్లో రాజకీయ జోక్యా న్ని ప్రోత్సహించడమేనన్నారు. దీనిపై ఐఏఎస్‌ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు