పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఆర్డీవో

3 Jul, 2017 15:08 IST|Sakshi

ఖమ్మం: ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరో వైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

వీరంతా సదరు ఆర్డీవో ఫాంహౌస్ లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు పట్టుబడ్డ విషయం బయటకి రాకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు