నల్లగొండ–మాచర్ల రైలుమార్గం రీ సర్వే

17 Feb, 2017 02:57 IST|Sakshi
నల్లగొండ–మాచర్ల రైలుమార్గం రీ సర్వే

దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌

నల్లగొండ క్రైం: నల్లగొండ–మాచర్ల రైలు మార్గాన్ని రీ సర్వేచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు.గురువారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చేం దుకు చర్యలు తీసుకుంటామని తెలి పారు. మఠంపల్లి–జాన్‌పహాడ్‌ రైలు మార్గం పనులు మార్చి వర కు పూర్తి అవుతాయని పేర్కొ న్నారు.

అనంతరం కొత్త రైళ్లను ప్రవేశపె డతామన్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గానికి అక్కడి ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతుం దని తెలిపారు. పిడుగు రాళ్ల– రొంపిచర్ల లేన్ల పనులను రూ.90 కోట్లతో చేపట్టి, 2018 నాటికి పూర్తి చెస్తామని చెప్పారు. విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు పనుల కు టెండర్లు ఖరారు చేశామని, 2019–20 నాటికి çపూర్తి చేస్తామని వివరించారు.

 

మరిన్ని వార్తలు