‘రియల్‌’కు ‘రైతుబంధు’!

28 Jun, 2019 09:36 IST|Sakshi
మిర్యాలగూడ :హైదలాపురం సమీపంలో లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఆర్డీఓ,  అధికారులు (ఫైల్‌) 

నాలా పన్ను చెల్లించని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉన్న వెంచర్లు

ఏంచక్కా రైతుబంధును వర్తింపజేసిన అధికారులు!

అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోని యంత్రాంగం

హాట్‌టాపిక్‌గా మారిన రియల్‌ వెంచర్లకు రైతుబంధు తతంగం

సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం.

కొందరు రియల్‌ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్‌ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్‌టాపిక్‌గా మారింది.  

మిర్యాలగూడ డివిజన్‌లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్‌వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది.

మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్‌నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్‌ ఎస్టేట్‌ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. 

ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్‌ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్‌ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం. 

పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం..
అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్‌ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్‌కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి.

అనుమతి లేని లేఅవుట్‌ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు.

ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ?
మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్‌శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్‌ను పరిశీలించి వదిలేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

డెంగీ.. డేంజర్‌

ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

భాష లేనిది.. నవ్వించే నిధి

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

నా కొడుకును బతికించరూ..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

మన ఇసుకకు డిమాండ్‌

పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు

శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ 

వానాకాలం... బండి భద్రం!

దేవుడికే శఠగోపం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!