నీలగిరిలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం

2 Oct, 2019 08:06 IST|Sakshi

శేషమ్మగూడెం డంపింగ్‌ యార్డులో ఏర్పాటుకు సన్నాహాలు

ఎకరం స్థలం కేటాయింపు.. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మాణం

సాక్షి, నల్లగొండ: నీలగిరి పట్టణంలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. సీడీఎంఏ అధికారులు రా ష్ట్రంలోని 15 మున్సిపాలిటీల్లో మలమూత్ర వ్యర్థ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో నీలగిరి మున్సిపాలిటీ కూడా ఉంది. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీకి సంబందించి శేషమ్మగూడెం డంపింగ్‌యార్డులో నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోనే టెండర్ల ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో శేషమ్మగూడెం డంపింగ్‌ యార్డులో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి పట్టణంలోని సెప్టిక్‌ ట్యాంకులనుంచి అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. దాదాపు 700 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ప్లాంట్‌ నిర్మించి మలమూ త్ర వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. పట్టణంలో సెప్టిక్‌ ట్యాంకులు నిండితే మున్సిపాలిటీ వారు నిర్ణయించే ధరకు సంబంధిత ఏజన్సీ వారు డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లి ఎరువుగా తయారు చేసా ్తరు. పట్టణంలోని మలమూత్ర వ్యర్థాలు వృథా కాకుండా దానిని శుద్ధి చేసి ఎరువుగా మార్చాలని సీడీఎంఏ అధికారులు ఎప్పటినుంచో ఆలో చన చేస్తున్నారు. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ శుద్ధి కేంద్రం నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ కూడా కావడంతో సంబంధిత ఏజన్సీ నిర్వాహకులు సోమవారం వచ్చి మున్సిపల్‌ కమిషనర్‌కు కలిశారు. శుద్ధి కేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా