శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం

31 Jul, 2018 03:02 IST|Sakshi

157.88 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ  

 సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో పాటు వస్తున్న ప్రవాహాన్ని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నిల్వ చేస్తుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గిపోయింది. సోమవారం ఉదయం శ్రీశైలం జలాశయంలోకి 55,431 క్యూసెక్కుల ప్రవాహం రాగా అది సాయంత్రానికి 37,196 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రసుత్తం శ్రీశైలం జలాశయంలో 157.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. తుంగభద్రలోనూ వరద ప్రవాహం తగ్గుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 33,375 క్యూసెక్కులు చేరుతుండగా 26,475 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 94.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం నుంచి తుంగభద్ర నదిలో వరద మరింత తగ్గనుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరనుంది.  

మరిన్ని వార్తలు