వైద్య ఉద్యోగుల క్రమబద్ధీకరణ

23 Mar, 2017 03:44 IST|Sakshi
వైద్య ఉద్యోగుల క్రమబద్ధీకరణ

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య శాఖలో వివిధ జిల్లాల్లో పనిచేసే 310 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీక రిస్తూ ఆ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా రోగ్యం కుటుంబ సంక్షేమ డైరక్టర్‌ పరిధిలో పనిచేసే 277 మంది, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో పనిచేసే 33 మందిని ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో భర్తీ చేసి క్రమబద్ధీకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

 ప్రజా రోగ్యం కుటుంబ సంక్షేమ డైర్టెక్టర్‌ పరిధిలో గ్రేడ్‌–2 ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పనిచేసే వారిలో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 22 మంది ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లా కు చెంది నవారు ఇద్దరు, కరీంనగర్‌ జిల్లాలో 31, మహబూబ్‌నగర్‌ జిల్లాలో∙23, మెదక్‌ జిల్లాలో 12 మంది ఉన్నారు. వరంగ ల్‌ జిల్లాలో 15 మంది, రంగారెడ్డి జిల్లాలో10, ఖమ్మంకు చెందిన 36 మంది ఉన్నారు.

 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌– 2లో ఆదిలాబాద్‌ జిల్లాలో 17 మంది, నిజామాబాద్‌ జిల్లాలో 8,  కరీంనగర్‌ జిల్లాలో11, మహబూబ్‌నగర్‌ 8,  మెదక్‌ 10 మంది, హైదరాబాద్‌ ఇద్దరు, వరంగల్‌ ఏడుగురు, ఖమ్మం జిల్లాకు చెందిన 38 మంది, రంగారెడ్డి 7 గురు, నల్లగొండ జిల్లాలో 16 మంది, అదే జిల్లాకు చెందిన ఇద్దరు పారా మెడికల్‌ ఉద్యోగులున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో పనిచేసే 33 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ మహిళల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన 13 మంది, నల్లగొండ 5 గురు, కరీంనగర్‌ ఒకరు, నిజా మాబాద్‌ ఇద్దరు, వరంగల్‌ జిల్లాలో 12 మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు