కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల

21 May, 2020 03:10 IST|Sakshi

తెలంగాణకు రూ.982 కోట్లు  

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలో మే నెలకు సంబంధించి రూ. 46,038.70 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో ఏపీకి రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు రూ. 982 కోట్లు విడుదలయ్యాయి. 2020–21 బడ్జెట్‌ అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిధులు విడుదల చేశామని, వాస్తవ వసూళ్ల మీద కాదని తెలిపింది. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి, రాష్ట్రాల ఆదాయ వనరుల పరిరక్షణకు వీలుగా, లిక్విడిటీ సమస్య లేకుండా చూసేందుకు ఈ నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ స్పష్టంచేసింది.
 
పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల: 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ, స్థానిక సంస్థల గ్రాంట్లను కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలకు విడుదల చేసింది. తొలి విడతగా రూ.5,005.25 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. పదిలక్షల జనాభా లోపు ఉన్న నగరాలకు ఈ నిధులను రాష్ట్రాలు కేటాయిస్తాయి. ఇందులో ఏపీకి రూ. 248.50 కోట్లు, తెలంగాణకు రూ. 105.25 కోట్లు విడుదలయ్యాయి.    

మరిన్ని వార్తలు