రిమాండ్‌ రిపోర్టు: బతికే ఉందన్న అనుమానంతో దహనం

30 Nov, 2019 19:48 IST|Sakshi

కీలకంగా మారిన ప్రియాంక ఫోన్‌ కాల్‌ లిస్ట్‌

మృతదేహంపైనా పలుమార్లు అత్యాచారం

సాక్షి, షాద్‌నగర్‌: ప్రియాంకారెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోని వచ్చాయి. బైక్‌ టైర్‌ పంక్చర్‌ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్‌ ఎంతకీ రాకపోవడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రియాంక రెడ్డి ఫోన్‌ ఆధారంగా మహమ్మద్ ఆరిఫ్‌ ఆచూకీని పోలీసులు కనుకున్నారు. దీంతో కేసు విచారణలో ప్రియాంక ఫోన్‌ కీలక ఆధారంగా మారింది.  రిమాండ్‌ రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ప్రియాంకను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో.. హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసి అత్యాచారం జరిపి.. రాక్షసానందం పొందారు.  ఒకరి తరువాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్లు రిపోర్టులో తేలింది. బుధవారం రాత్రి 9.30 నుండి 10.20 వరకు కీచకులు ఈ దారుణకాండ కొనసాగించారు.

ఆ సమయంలో ప్రియాంక తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితులు ముక్కు, నోరు గట్టిగా నొక్కి పట్టారు. దీంతో ఊరిపి ఆడక బాధితురాలు మృతి చెందింది. అనంతరం బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు. లారీలోకి ఎక్కించి తరువాత కూడా మృతదేహంపై కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడయింది. లారీ క్యాబీన్‌ను పరిశీలించిన పోలీసులు రక్తపు మరకలు, వెంట్రుకలను సేకరించారు. అయితే షాద్‌నగర్‌ బ్రిడ్జ్ వద్ద ప్రియాంకను కిందకు దింపాలని వారు నిర్ణయించారు. ప్రియాంక బతికే ఉంటుందన్న అనుమానం రావడంతో పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. కాగా ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, వెంటనే ఉరివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు