ఇండస్ట్రియల్‌ హబ్‌గా రేణికుంట

23 Mar, 2018 15:11 IST|Sakshi
పరిశీలిస్తున్న కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌  

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌

 అల్గునూర్‌(మానకొండూర్‌): తిమ్మాపూర్‌ మండలం రేణికుంట గ్రామాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. గ్రామంలోని 19ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 2016 టీఎస్‌ ఐపాస్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఈ çస్థలాన్ని గురువారం పరిశీలించి మాట్లాడాడు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఇందు లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు.

టీఎస్‌ ఐపాస్‌లో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేవారికి రేణికుంటలో స్థలం కేటాయిస్తున్నామన్నారు. 19 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం అల్గునూరులోని ఎస్సారెస్పీ స్థలాన్ని సందర్శించారు. దీంట్లో నర్సరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం తిమ్మాపుర్‌లోని మోడల్‌ స్కూల్‌ స్థలాన్ని సందర్శించారు. పాఠశాల ప్రహరీ వివాదాన్ని పరిష్కరించారు.  

మరిన్ని వార్తలు