ఏజెన్సీకి డీఈడీ..!

23 Nov, 2014 02:44 IST|Sakshi

ఉట్నూర్ : ఏజెన్సీలో గిరిజన విద్యాభివృద్ధికి ఐటీడీఏ చర్యలు వేగవంతం చేసింది. 2003లో మూతపడ్డ టీటీసీ (డీఈడీ) కళాశాలను తిరిగి ప్రారంభించేందుకు ఐటీడీఏ పీవో గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదన లు పంపించారు. ప్రస్తుతం ఫైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఉంది. ఆమోదం పొందితే త్వరలో ఏజెన్సీ కేంద్రంగా డీఈడీ కళాశాల
 ప్రారంభం కానుంది.

 1986లో ప్రారంభం..
 ఏజెన్సీలో గిరిజన విద్యాభివృద్ధికి అప్పటి ప్రభుత్వం హైమాన్ డార్ఫ్స్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం మార్లవా యి పేరుతో ఉట్నూర్‌లోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో ప్రారంభించింది. అప్పటికే ప్రభుత్వం గిరిజన విద్య అభివృద్ధికి వెయ్యి ఉపాధ్యాయ పోస్టులను సృష్టించి గిరిజన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించడంతో వా రికి ఇన్ సర్వీస్‌లో టీటీసీ శిక్షణ ఇస్తూ వచ్చింది. 1990లో మండలంలోని లాల్‌టెక్డిలో కళాశాలకు నూతన భవనాలు నిర్మించడంతో కళాశాల లాల్‌టెక్డీకి తరలివెళ్లింది. 1992లో ఉన్న కళాశాలకు సబ్‌డైట్ కళాశాల హోదా రావడంతో గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతూ వచ్చింది.

అయితే.. 2003లో ప్రభుత్వం ఇన్ సర్వీస్ డిస్టెన్స్ మోడ్‌కు అవకాశం కల్పించడం.. గిరిజన డైట్ కళాశాల ప్రభావం తగ్గడంతోపాటు అప్పటి అధికారులు నిర్లక్ష్యంతో కళాశాల మూతపడింది. నాటి నుంచి కళాశాల పునఃప్రారంభంపై ఎవరూ పట్టించుకోలేదు. దీంతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు వృథాగా మారాయి. చివరికి 2008లో గిరిజన బీఎడ్ కళాశాల ఏజెన్సీలో ప్రారంభం కావడంతో ప్రస్తుతం డీఈడీ కళాశాల భవనాల్లో బీఎడ్ కళాశాల కొనసాగుతోంది.

 పునఃప్రారంభానికి చర్యలు..
 డీఈడీ కళాశాల పునఃప్రారంభానికి ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ దృష్టి సారించారు. తిరి గి ప్రారంభిస్తే గిరిజన విద్య మరింత బలపడుతుందని గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ఆదేశాలతో గత నెలలో ఐటీడీఏ అధికారులు మరోసారి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఉండడంతో డీఈడీ కౌన్సెలింగ్‌కు ముందు అనుమతులు వస్తాయనే ఆశాభావం అందరిలోనూ ఉంది. గత నెలలో ప్రతిపాదనలు పంపించిన ట్లు ఇన్‌చార్జి డీడీటీడబ్ల్యూ పెందోర్ భీమ్ తెలిపారు. డీఈడీ కళాశాల ప్రారంభానికి అనుమతులు వస్తే గిరిజన విద్యార్థులు ఇంటర్‌లో సాధించిన మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.

 ప్రజాప్రతినిధులు స్పందిస్తే మేలు..
 జిల్లాలో 123 ఆశ్రమ పాఠశాలతోపాటు ఆరు గిరిజన గురుకుల కళాశాలున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం దాదాపు 45 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురుకుల కళాశాలల్లో ఏటా ఇంటర్ పూర్తిచేస్తున్న వారు 1200 వరకు ఉంటున్నారు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో పలువురు ఇంటర్ పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తి విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వారి ఆర్థిక పరిస్థితులు సహకరించక కొందరూ ప్రైవెట్‌లో లక్షలు చెల్లించలేక ఉపాధ్యాయ విద్యకు దూరమవుతున్నారు. ప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కళాశాలను తెరిపిస్తే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుంది.

మరిన్ని వార్తలు