వైద్యారోగ్య శాఖలో 660 ఖాళీల భర్తీ

19 May, 2017 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 660 ఖాళీ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో అత్యధికంగా 382 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులున్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది.

ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలను ఇందులో పొందుపరిచింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హెచ్‌వోడీ పరిధిలో 143 పోస్టులు, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌ హెచ్‌వోడీ పరిధిలో 457 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ పరిధిలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు