‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

7 Mar, 2019 10:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీపీల జిల్లా కోటాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కసరత్తు చేసిన జిల్లా పరిషత్‌ అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఎంపీపీ, జెడ్పీటీసీలకు సంబంధించి మండలాల వారీగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగించారు.ఎంపీటీసీల రిజర్వేషన్‌ మాత్రం ఆయా జిల్లాల ఆర్‌డీఓల పర్యవేక్షణలో ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్‌ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీల రిజర్వేషన్‌ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించారు.

ఉదయంనుంచి రాత్రి వరకు రిజర్వేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రస్తుతం తయారు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతికి సూర్యాపేట, భువనగిరికి రిజర్వేషన్‌ జాబితాను పంపంచి అనుమతి తీసుకున్నారు.

జిల్లాల వారీగా రిజర్వేషన్‌

నల్లగొండ జిల్లా ఎంపీపీ  జెడ్పీటీసీ
అడవిదేవులపల్లి ఎస్టీ(జ)   ఎస్టీ(జ)
అనుముల      ఎస్సీ(జ)  ఎస్సీ(జ)
చందంపేట ఎస్టీ(మ)   ఎస్టీ(మ)
చండూరు బీసీ(మ)  బీసీ(జ)
చింతపల్లి     జనరల్‌(మ) జనరల్‌(మ)
చిట్యాల     బీసీ(మ)   బీసీ(మ)
దామరచర్ల        ఎస్టీ(మ) ఎస్టీ(మ)
దేవరకొండ     జనరల్‌   జనరల్‌(మ)
గుండ్లపల్లి     జనరల్‌(మ)  జనరల్‌
గుర్రంపోడు     జనరల్‌ జనరల్‌(మ)
కనగల్‌    బీసీ(జ)   బీసీ(జ)
కట్టంగూర్‌     జనరల్‌  జనరల్‌
కేతెపల్లి     ఎస్సీ(జ)   ఎస్సీ(మ)
కొండమల్లేపల్లి    జనరల్‌(మ)   జనరల్‌(మ)
మాడ్గులపల్లి ఎస్సీ(మ)  ఎస్సీ(జ)
మర్రిగూడ  జనరల్‌  జనరల్‌
మిర్యాలగూడ     జనరల్‌(మ)  జనరల్‌
మునుగోడు    బీసీ(జ)  బీసీ(మ)
నకిరేకల్‌    జనరల్‌    జనరల్‌(మ) జనరల్‌  జనరల్‌(మ)
నల్లగొండ    ఎస్సీ(జ)    ఎస్సీ(జ) ఎస్సీ(జ)     ఎస్సీ(జ)
నాంపల్లి        జనరల్‌(మ) జనరల్‌
నార్కట్‌పల్లి     నార్కట్‌పల్లి(జ) జనరల్‌
నేరేడుగొమ్ము     ఎస్టీ(జ)   ఎస్టీ(జ)
నిడమనూరు   జనరల్‌(మ) జనరల్‌(మ)
పీఏపల్లి     జనరల్‌   జనరల్‌(మ)
పెద్దవూర     జనరల్‌(మ) జనరల్‌
శాలిగౌరారం     ఎస్సీ(మ)   ఎస్సీ(మ)
తిప్పర్తి     జనరల్‌  జనరల్‌
తిరుమలగిరి సాగర్‌    ఎస్టీ(జ)   ఎస్టీ(మ)
త్రిపురారం     జనరల్‌(మ) జనరల్‌(మ)
వేములపల్లి     ఎస్సీ(మ)   ఎస్సీ(మ) 

అడ్డగూడూరు ఎస్సీ(జ)   ఎస్సీ(మ)
ఆలేరు ఎస్సీ(జ)   ఎస్సీ(జ)
ఆత్మకూరు ఎం      జనరల్‌(మ)   జనరల్‌
బొమ్మల రామారం   జనరల్‌  జనరల్‌
భువనగిరి బీసీ(మ)   బీసీ(జ)
బీబీనగర్ జనరల్‌     జనరల్‌(మ)
చౌటుప్పల్‌    జనరల్‌     జనరల్‌
గుండాల    ఎస్సీ(మ)   ఎస్సీ(మ)
మోటకొండూరు       జనరల్‌(మ)  జనరల్‌    
మోత్కూర్‌     జనరల్‌(మ)   జనరల్‌(మ)
నారాయణపురం    జనరల్‌(మ)   జనరల్‌(మ)
పోచంపల్లి    జనరల్‌      జనరల్‌(మ)
రాజాపేట   బీసీ(జ)  బీసీ(జ)
రామన్నపేట     బీసీ(మ)  బీసీ(మ)
తుర్కపల్లి     ఎస్టీ(జ)  ఎస్టీ(జ)
వలిగొండ     బీసీ(జ)    జనరల్‌(మ)
యాదగిరిగుట్ట   బీసీ(జ)      బీసీ(మ)

నల్లగొండ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్‌తోపాటు మిగిలిన రెండు జిల్లాల జాబితాను కూడా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అనుమతితో జెడ్పీ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలో మొత్తం 16మహిళలకు రిజర్వ్‌ కాగా, 15 మండలాలు జనరల్‌కు కేటాయించారు.

సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు మహిళలకు 12, జనరల్‌కు 11 కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 7 మహిళలకు రిజర్వ్‌ చేయగా, 10 జనరల్‌కు కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు. 

మరిన్ని వార్తలు