కరోనా భయంతో పొలాల్లో నివాసం

6 Apr, 2020 03:50 IST|Sakshi

వైరస్‌ ప్రభావం తగ్గే వరకు ఇళ్లలోకి రామంటున్న 30 కుటుంబాలు

నేరడిగొండ: ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మథుర కాలనీవాసులు ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రాల బాట పట్టారు. ఈ కాలనీకి చెందిన 30 కుటుంబాలు పొలాల్లో గుడారాలు వేసుకొని వంటావార్పు చేసుకుంటూ.. వైరస్‌ ప్రభావం తగ్గే వరకు అక్కడే ఉంటామని పేర్కొన్నారు. కొంతమంది ఇలా వ్య వసాయ క్షేత్రానికి వెళ్లడంతో మిగతా వారు వారి వారి ఇళ్ల నుంచి బ యటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఈ కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు