రిటైర్డ్‌ సీఐ భూమయ్య సంచలన వ్యాఖ్యలు!

31 Aug, 2019 14:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : పోలీసుశాఖ తీరుపై రిటైర్డు సీఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనను అవినీతి కేసుల్లో ఇరికించి, తనకు గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. తన మీద పగ తీర్చుకోవడానికి కొందరు కక్ష కట్టారని, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో పనిచేసే వేణుగోపాల్‌తో ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌​ అధికారులకు ఏ హాని లేనప్పటికీ ప్రభుత్వ ఖర్చుతో గన్‌మెన్లను ఏర్పాటు చేశారని, ప్రాణహాని ఉన్న తనకు మాత్రం గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో తన రెండు తుపాకులు మాయమైతే ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదని, తానే ఆ రెండు ఆయుధాలు తీసుకుపోయినట్లు ఆరోపించి విచారణ జరిపారని విమర్శించారు. కాగా విచారణలో తన పొరపాటు లేదని తేలినప్పటికీ.. ఆ రెండు ఆయుధాల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొన్నారు.

ఇప్పటికైనా మాయమైన రెండు ఆయుధాలపై సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హుస్నాబాద్ సీఐగా పనిచేసినప్పడు అప్పటి సిద్దిపేట సీపీ శివకుమార్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వాహనం వినియోగించుకొని తన గన్‌మెన్‌ను వాడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై ఆరోపణలు చేసినందుకు కక్షగట్టి ఆదిలాబాద్‌కు బదిలీ చేశారని తెలిపారు. ఐపీఎస్‌ అధికారి పనితీరును ప్రశ్నించినందుకు కక్షగట్టి ఏసీబీ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థలో ఉన్న చీడ పురుగుల పట్ల దృష్టి సారించాలని ఓ సామాన్య పౌరుడుగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

‘ఆ ఆలోచన విరమించుకోవాలి’

హరితంలో 'ఆ' మొక్కలకే అధిక ప్రాధాన్యం

ఫేస్‌బుక్‌ పరిచయాలు..ప్రాణాలకు ముప్పు

పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి

ఓ మై డాగ్‌!

కొత్త సేవల్లోకి తపాలాశాఖ

'డై' యేరియా!

అంతా అక్రమార్కుల ప్లాన్‌ ప్రకారమే!

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!

అఖిలపక్ష నేతల పొలికేక

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం

రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీపీఎస్‌ ఉద్యోగులు

ఎకరం లేఅవుట్‌ ఏదీ ఆదాయం?

స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం

మలుపు తిరుగుతున్న శ్రీనివాస్‌ మృతి కేసు

రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!

ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

'బవొబాబ్‌' 500 ఏళ్లు

వారం రోజుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు

అనగనగా ఓ రచయిత్రి

‘ప్లాంట్‌ గణేశ్‌’ విగ్రహాలు

అభాసుపాలైన టాస్క్‌ఫార్స్‌..!

సెల్‌ టవరెక్కి మహిళ హల్‌చల్‌

స్పందించిన పోలీస్‌ హృదయం

మత్స్యగిరీశుడికి మహర్దశ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ