‘గే’ల మధ్య గలాటా

15 Oct, 2014 00:50 IST|Sakshi
‘గే’ల మధ్య గలాటా
  • యువకుడి దుర్మరణం
  •  నిందితుడు రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్
  • హిమాయత్‌నగర్: విచక్షణ మరిచిన ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి తీరు సభ్య సమాజం తలదించుకొనేలా చేసింది. పదుగురికి స్ఫూర్తిగా నిలవాల్సిన ఆయన వికృత చేష్టలు ఓ  నిండుప్రాణం గాలిలో కలసిపోయేలా చేసింది. ‘తోడు’ కోసం తెచ్చుకున్న ఓ యువకుడిని మూడో అంతస్తు పైనుంచి తోసేయడంతో దుర్మణం పాలయ్యాడు.  సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన నారాయణగూడ లింగంపల్లిప్రాంతంలో సంచలనం సృష్టించింది.  

    పోలీసుల వివరాల మేరకు...పరిశ్రమల శాఖ (చిరాక్ అలీలేన్)లో డిప్యూటీ డెరైక్టర్‌గా వి. నరసింహారావు 2011లో పదవీ విరమణ పొందారు.  ప్రస్తుతం ఆయన ఓ న్యాయవాది వద్ద స్టెనో కం టైపిస్టుగా పనిచేస్తున్నారు. న్యాయవాది కార్యాలయం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగంపల్లికి చెందిన అన్నపూర్ణ ఏఎస్‌ఎన్ రెసిడెన్సీ 3వ అంతస్తులో ఉంది. పని ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి 10 గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు.

    తర్వాత అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ వద్దకు వెళ్లారు. వాస్తవానికి నరసింహారావు స్వలింగసంపర్కుడు (గే).  అక్కడ గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. రాత్రి నరసింహారావుతో ఉండేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. అక్కడ నుంచి వారు న్యాయవాది కార్యాలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తన కోరిక తీర్చలేదంటూ ఆ యుకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో అంతస్తుపై నుంచి తోసేశాడు నరసింహారావు.

    ఆ యువకుడు కాంపౌండ్‌వాల్‌పై పడిపోయాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నారాయణగూడ పోలీసులు అటుగా వచ్చి పైనుంచి పడిన యువకుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే యువకుడు చనిపోయాడు. పోలీసులు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు కూడా ‘గే’గానే అనుమానిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు