గోల్డ్‌ తెలంగాణను.. ‘గోల్డ్‌ స్టోన్‌’ కిచ్చారు

18 Jun, 2017 01:45 IST|Sakshi
గోల్డ్‌ తెలంగాణను.. ‘గోల్డ్‌ స్టోన్‌’ కిచ్చారు
- భూ దోపిడీలో కేసీఆర్, ఆయన కుటుంబీకులే భాగస్వాములు
- ఘాంసిమియాగూడ భూములు కొన్న కేకే, డీఎస్‌లపై చర్యలేవి?
- కేకే కొన్న భూముల్ని రైతులతో దున్నించిన రేవంత్, ఎల్‌.రమణ
 
శంషాబాద్‌ రూరల్‌: ‘కేసీఆర్‌ ఈ రోజు.. గోల్డ్‌ తెలంగాణను గోల్డ్‌ స్టోన్‌ ప్రసాద్‌కు అప్పగించావు... నీవు, నీ కుటుంబం, అనుచరులు భూ దోపిడీలో భాగస్వాములు. తెలంగాణ సమాజం ముందు కేసీఆర్‌ ముద్దాయిగా నిలబడాల్సిందే.. కేసీఆర్‌కు గజ్వేల్‌లో గజం భూమి పోలేదేమో గానీ.. ఇక్కడ పేదోళ్ల భూములు వందల ఎకరాలు అన్యాక్రాంత మయ్యాయి..’అని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ఘాంసిమియాగూడలో గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ అక్రమంగా కాజేసిన ప్రభుత్వ భూములను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.

రైతులతో మాట్లాడి వారి చేత నాగలి పట్టి భూములను దున్నించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాజధాని, శివారు ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్‌ రోజు కోమాట మాట్లాడుతున్నారని, ఒకరోజు పెద్దఎత్తున కుంభకోణం వెలికి తీశామంటారు.. మరోరోజు గజం భూమి పోలేదు.. రూపాయి నష్టం జరగలే దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మియా పూర్‌లో దాదాపు 700 ఎకరాలను పరిశీలిస్తే ఇప్పటికీ ఆ భూములు గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆధీనం లోనే ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కేశవరావు, కుటుంబ సభ్యులు ఈ భూముల్లో భూమిపూజ చేసినట్లు వెల్లడైనా చర్యలు తీసుకోవడంలేదన్నారు.

భూకుంభ కోణంలో నిం దితులైన ట్రినిటీ కంపెనీ డైరక్టర్‌ పార్థసారథి, శర్మను అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం.. వారికి బెయిల్‌ రాకుండా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించలేదన్నారు. గోల్డ్‌ స్టోన్‌ప్రసాద్‌ మరద లు సీఎం కార్యాలయం అధికారిగా ఉంటూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను నిర్వహిస్తుండగా.. ఆమెపై చర్యలు తీసుకోకపోగా.. సబ్‌రిజిస్ట్రార్‌లను అరెస్టు చేసి జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నిం చారు. అవినీతికి పాల్పడ్డారంటూ దళితబిడ్డ డాక్టర్‌ రాజ య్యను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్‌.. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్య మంత్రిపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు.

ఎంపీ డి.శ్రీనివాస్‌ అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినట్లు పత్రికల్లో వార్తలు వస్తే ఆయన నుంచి కనీసం వివరణ కూడా అడగలేదన్నారు. మీ నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ల నుంచి మొదలుపెడితే.. సీఎం కార్యాలయ సిబ్బం ది, ఎంపీలు, ఎమ్మెల్యేలు భూ కుంభకోణంలో కూరుకుపోయారని రేవంత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ నేరస్తుడు నయీం పోలీ సులకు దొరుకుతాడు కాని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ దొర కడా? అతని కోసం దేశమంతా వెతుకుతున్నారు.. కానీ సీఎం ఫాంహౌస్‌లో దాక్కున్నా డేమో చూ శారా..? అంటూ ప్రశ్నించారు. మీ కుటుం బానికి ప్రసాద్‌కు ఉన్న అనుబంధం కనిపిస్తుందని రేవంత్‌ ఆరోపించారు. భూకుంభకోణాలను వెలికి తీసేం దుకు సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 
 
చట్టాన్ని పటిష్టం చేయాలి: రమణ
ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూ ఆక్రమిత చట్టాన్ని పటిష్టం చేయాలని టీటీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. భూ కబ్జాలను అరికట్టే విషయంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వచ్చి ఘాంసిమియాగూడ ఆడపడుచుల ఆక్రందనలను వినాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి అడుగు స్థలం విలువైనదేనని, ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఆ పార్ట నేతలు అరవింద్‌కుమార్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు