‘టిమ్స్‌’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌: రేవంత్‌ రెడ్డి

30 Apr, 2020 01:30 IST|Sakshi

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) కు తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నట్టు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘టిమ్స్‌’లో ప్రభుత్వం సీవరేజ్‌ ప్లాంటు ఏర్పాటు చేయలేదని, దీంతో మురుగునీరు పక్కనే ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలోకి వెళుతున్న విషయాన్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకు వచ్చారని, ఈ ప్లాంటు నిర్మాణం కోసం నిధులు ఇస్తునట్టు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.  చదవండి: ఖైదీ నంబర్‌ 3077 : కేటీఆర్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా