రేవంత్‌ మోసం చేశాడు

8 Nov, 2017 12:36 IST|Sakshi

తాండూరు టౌన్‌ : తెలుగుదేశం పార్టీని మోసం చేసి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజుగౌడ్‌ ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి పార్టీని వదిలి స్వలాభం కోసం ఆయన కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఆయన పార్టీలో లేకున్నా వచ్చే నష్టమేమీ లేదన్నారు. టీడీపీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తేలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాండూరు నుంచి బరిలోకి దిగుతానన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, మహారాజుల పాలనతోనూ ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి కథ ముగించేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీగా టీడీపీకి పేరుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుమిత్‌గౌడ్, పట్టణా«ధ్యక్షుడు మహేశ్‌సింగ్‌ ఠాకూర్, బషీరాబాద్‌ మండల అధ్యక్షుడు మ«ధుసూదన్‌గౌడ్, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు బాసిత్, నాయకులు మనోహర్, రుద్రుపాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డాక్టర్లకు ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం’

10 మంది ఇండోనేసియన్లపై కేసు నమోదు

లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు : కేసీఆర్‌

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్‌ పిలానీ

కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్‌ కేసులు

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’