‘సిద్దిపేట’వెంట 20మంది ఎమ్మెల్యేలు

1 Nov, 2014 02:44 IST|Sakshi
‘సిద్దిపేట’వెంట 20మంది ఎమ్మెల్యేలు

* సీఎం పదవిని కాపాడుకోవడానికి చేరికలకు ప్రోత్సాహం
* కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపాటు

తాండూరు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేదని.. ఉన్న 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు ఉన్నారని.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పరోక్షంగా హరీష్‌రావును ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు. సీఎంకు సొం త పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకంలేకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు వాళ్లను తీసుకొస్తున్నారన్నారు. ‘తీగల’ వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి వర్గంలో, నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.  2005 లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరితే.. అది ప్రజాస్వామ్యపద్ధతి కాదని, వారిపై అనర్హత వేటు వేయాలన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించా రు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు.
 
మహబూబ్‌నగర్‌ను నిర్లక్ష్యం చేస్తూ జూరాల,నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకువస్తానని చెబుతుం డటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ కాలం పనిచేయదని, టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలనే కేసీఆర్ కల నెరవేరదని అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి ఎలాంటి అ భ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వస్తే తాను తెలంగాణ సీఎం అవుతానన్నది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. అందరికీ ఆశలు ఉంటా యి.. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు.  మంత్రులు డమ్మీలు అని, సీఎం నకిలీ మాటల నాయకుడు అని ఆయన తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు.

మరిన్ని వార్తలు