రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

22 Apr, 2015 00:52 IST|Sakshi
రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం కింది కోర్టులో జరుగుతున్న విచారణతో సహా తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, అతనిపై కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది కె.గోవర్ధన్‌రెడ్డి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోర్టు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. దీనిపై మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు