తుదిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి

5 Oct, 2019 03:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

జాగో తెలంగాణసభలో వక్తలు

పంజగుట్ట:తెలంగాణలోని సమస్త ప్రజానీకం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొంతమంది చేతుల్లోకి వెళ్లిందని, వారి నుండి విముక్తి కల్పించేందుకు తుదిదశ ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. జాగో తెలంగాణ కన్వీనర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన ఇక్కడ జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం కేసీఆర్‌ కుటుంబసభ్యులు ప్రమాణస్వీకారం చేసినరోజే ఇది ప్రజల తెలంగాణ కాదని భావించామన్నారు. టీఆర్‌ఎస్‌కు ఒక్క రోజు కూడా పాలించే అర్హతలేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం తెచ్చి ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుండాలని అన్నారు.   అమరవీరుల స్మృతి వనాన్ని హైదరాబాద్‌లో తక్షణమే నిర్మించాలని,  అమరుల కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్,  గౌతు కనకయ్య, గాదె ఇన్నారెడ్డి, బెల్లయ్యనాయక్, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు