స్పీకర్‌ను కలవడానికి రేవంత్‌ విఫలయత్నం

24 Mar, 2017 03:05 IST|Sakshi
స్పీకర్‌ను కలవడానికి రేవంత్‌ విఫలయత్నం

లాబీల్లోకి రాకుండానే అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్‌: స్పీకర్‌ను కలవడానికి వెళ్తున్న టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డిని లాబీ ప్రధాన గేటువద్దనే అసెంబ్లీ సిబ్బంది గురువారం అడ్డుకున్నారు. మూడురోజుల ఢిల్లీ పర్యటనలో రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులు, అనంతరం జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో  స్పీకర్‌ను కలవడానికి రేవంత్‌ ప్రయత్నించారు.

తాను శాసనసభ్యుడ్ని ఎందుకు అడ్డుకుంటున్నారని, స్పీకర్‌ కార్యాలయం నుంచి లేదా కార్యదర్శి కార్యాలయం నుంచి ఏమైనా ఆదేశాలు ఉంటే చూపించాలని రేవంత్‌ ప్రశ్నించారు. అయినా అసెంబ్లీ సిబ్బంది అంగీకరించలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి అసెంబ్లీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వ్యవహారాల నుంచి సస్పెండ్‌ చేసినా, అసెంబ్లీ లాబీల్లో తిరగకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇది గౌరవ శాసనసభ్యులను అవమానించడమేనని అన్నారు.

స్పీకర్‌పై కోర్టు ఉల్లంఘన కేసు: రేవంత్‌ హెచ్చరిక
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా కోర్టు సూచనలను ఉల్లం ఘించిన స్పీకర్‌పై కోర్టు ఉల్లంఘన కేసు వేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.     తాము వేసిన కేసుతో 90రోజుల్లోగా చర్యలను తీసుకోవాలని హైకోర్టు సూచిం చిందని, ఆ గడువు కూడా డిసెంబర్‌ 21నాటికే పూర్తయిందన్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసి మరో 100 రోజులు దాటినా స్పీకర్‌ చర్యలు తీసుకోలేదన్నారు.

మరిన్ని వార్తలు