కోర్టుకు 'ఓటుకు నోటు' వీడియో ఫుటేజ్

3 Jun, 2015 17:01 IST|Sakshi
కోర్టుకు 'ఓటుకు నోటు' వీడియో ఫుటేజ్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ల మధ్య సంభాషణల వీడియో ఫుటేజ్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. నిర్ధారణ కోసం ఈ వీడియో ఫుటేజ్‌ను కోర్టు ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించింది. ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపులపై నివేదిక సమర్పించాలని ఏసీబీ కోర్టు సూచించింది. రేవంత్ రెడ్డి ఆడియోను మరోసారి రీ రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటు వేసేందుకుగాను స్టీఫెన్‌కు రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు