జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్‌

9 Sep, 2019 03:25 IST|Sakshi

మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సుష్మాస్వరాజ్, అద్వానీని ఒప్పించి రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జైపాల్‌రెడ్డి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు.

జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో జైపాల్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. చట్టసభల్లో ఆయన నిజాయితీగా, హుందాగా వ్యవహరించి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని కొనియాడారు. ఈ సభకు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు