భూ తగాదా

11 Sep, 2014 01:10 IST|Sakshi
భూ తగాదా

రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయ లోపం
భూవివాదంలో 25 వేల ఎకరాలు
రెండు శాఖల మధ్య నలుగుతున్న 8 వేల మంది లబ్ధిదారులు
పరిష్కారం చూపాలని వేడుకోలు
 నెన్నెల : రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం లబ్ధిదారులకు శాపంగా మారింది. రెవెన్యూ అధికారు లు పంచిన భూములను సాగు చేయకుండా అటవీశాఖతో అధికారులు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులేమో పంచిన భూములపై పూర్తిస్థాయి హక్కులు ఉంటాయని తెలుపుతున్నారు. కానీ, అటవీ శాఖ అధికారులు ఆ భూములు రిజర్వు ఫారెస్టు కిందకి వస్తాయని అందులో పంటలు ఎలా సాగు చేస్తారని పేర్కొంటున్నారు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదంలో జిల్లాలో దాదాపు 8 వేల మందికి సంబంధిం చిన 25 వేల ఎకరాల భూములు ఉన్నాయి.

ఈ రెండు శాఖల మధ్య లబ్ధిదారులు సమిధలవుతున్నారు. దశాబ్దాలుగా వామపక్షాలు పేదల పక్షాన పోరాడితే అధికారులు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ, భూ సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. కాగా, ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడం వివాదాలకు కారణంఅవుతుంది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేక పోవడమే కారణంగా కనిపిస్తుంది.
 
వివాదంలో 25 వేల ఎకరాలు
జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వ భూములున్న నె న్నెల మండలంలో దాదాపు 7,600 ఎకరాల భూ మి చిక్కుల్లో చిక్కుకుని ఉంది. నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్ 34, 36లలో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్ శివార్‌లలోని సర్వే నంబరు 4/2, 4/3లలో 600ఎకరాలు, కొ నంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద 700 ఎకరా లు, నెన్నెల, బొప్పారం వద్ద గల సర్వే నంబరు 671, 672,674లలో 1,200 ఎకరాలు, సీతానగర్‌లోని సర్వే నంబరు 1లో 400 ఎకరాలు, జైపూర్ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబరు 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోధుంపేట శివారు సర్వే నంబరు 3లో 350 ఎకరాలు.

చామనపల్లి శివారులోని సర్వే నంబరు 61లో 100 ఎకరాలు, సూరారంలో మరో 200 ఎక రాలు, చెన్నూర్ మండలం కన్నెపల్లి, బుద్ధారం, సంకారం, గ్రామాలకు అనుకొని ఉన్న సర్వే నంబ రు 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లి శివారు సర్వే నంబరు 33లో 220 ఎకరాలు, భీమిని మండలం రెబ్బెన శివారు సర్వే నం బరు 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్ శివారు సర్వే నంబరు 101లో 120 ఎకరాలు, మెట్‌పల్లిలో ని సర్వే నంబరు 20, 22లలో 150 ఎకరాలు, జజ్జరెల్లిలోని సర్వే నంబరు88/89లో 400ఎకరాల భూ మి వివాదంలో ఉంది.

కోటపల్లి మండలం కొండంపేట, పార్‌పల్లిలో దాదాపు 800ఎకరాలు, సిర్పూర్ మండలంలో 6,800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4,300 ఎకరాలు, కౌటాలలో 3,600 ఎకరాలు, రెబ్బెనలో 2,900 ఎకరాలు, దహెగాంలో 580 ఎకరాల భూ ములు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖా నాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా సమస్య తీ వ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరుశాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి.
 
జాయింట్ సర్వేపై జాప్యం
ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత ప్రజల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్ సర్వే నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోఖా(పొజీషన్) ఎ క్కడుందనేది చూపకపోవడంతో లబ్ధిదారులు ఆ నంబరులో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబరు ఆధారం గా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఈ భూములు రిజర్వు ఫారెస్టుకు చెందినవని అటవీశాఖ అడ్డుకుంటుంది.

రికార్డుల్లో పీపీ ల్యాండుకే పట్టాలిస్తున్నామని రెవె న్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అ టవీ భూములను కబ్జా చేస్తున్నారని అటవీ అధికారులు ఆరోపిస్తున్నారు. అటవీ భూములు నిర్దారిం చేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్టు సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినపుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు