వాడ్యాల్‌లో రెవెన్యూ అధికారుల నిర్బంధం

29 May, 2018 13:21 IST|Sakshi
కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు   

మిడ్జిల్‌ (జడ్చర్ల): మండలంలోని వాడ్యాల్‌ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను నిర్బంధించారు. భూ పక్షాళణలో జరిగిన తప్పులను సరిచేయడానికి సోమవారం రెవెన్యూ అధికారుల బృందం గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలో ప్రభుత్వ భూమి సర్వే నం.0లో దాదాపు 60 మంది రైతులు సాగులో ఉండగా, వారికి రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదు.

అలాగే సర్వే నం.229లో ఉన్న అసైన్డ్‌ భూమిలో పట్టా ఉన్న రైతులకు కూడా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అరుణ చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు.

తహసీల్దార్‌ పాండునాయక్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆర్డీఓకు ఫోన్‌లో వివరించగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అధికారులను వదిలిపెట్టారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పా సు పుస్తకంతోపాటు చెక్కులను అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు