ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు

9 Feb, 2018 18:00 IST|Sakshi
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది

కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌

జవహర్‌నగర్‌ : ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ అన్నారు. గురువారం జవహర్‌నగర్‌లోని మోహన్‌రావుకాలనీ, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాలలోని సర్వే నం.606 పార్ట్‌లో 4 రూంలు, 8 బేస్‌మెంట్లను తొలగించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ... భవిష్యత్‌ తరాల కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదల నివాస స్థలాలకు హక్కులను కల్పించడమే కాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడడమే తమ లక్ష్యమన్నారు.

కొందరు కబ్జాదారులు అయాయక ప్రజలకు ప్రభుత్వ స్థలాలను కట్టబెడుతున్నారని అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇళ్లులేని నిరుపేదల కోసం ప్రభుత్వం డబుల్‌ బెడ్రూమ్‌లను నిర్మిస్తోందని, ఇళ్లు లేని వారు ఇళ్ల కోసం మీసేవలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్, మండల సర్వేయర్‌ యాదగిరి, వీఆర్‌ఓలు వెంకటేష్, స్వాతిలతో పాటు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు