బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష 

8 Sep, 2019 03:10 IST|Sakshi

ఉన్నతాధికారులతో సమావేశమైన స్పీకర్‌ పోచారం 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహిం చారు. స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్‌కు సంబంధించిన పలు అంశాలతోపాటు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా అధికారులు సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పీకర్‌ సూచించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌ల జారీ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపైనా స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణతో పాటు పరిసరాల్లో చేపట్టిన బందోబస్తు వివరాలను పోలీసు అధికారులు స్పీకర్‌కు వివరించారు. సమావేశంలో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో పాటు, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన శాసనసభ చీఫ్‌ మార్షల్‌ టి.కరుణాకర్‌ను స్పీకర్‌ ఈ సందర్భంగా అభినందించారు.  

మండలిలో బడ్జెట్‌ ప్రతిపాదన.. 
ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం కేసీఆర్‌.. శాసనసభలో స్వయంగా 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయగా, బడ్జెట్‌ సమావేశం ప్రారంభమయ్యేలోగా మంత్రిమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిలో బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారనే అంశంపై గోప్యత కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించగా, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాననమండలిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జరిగే సమావేశాల్లో శాసనమండలిలో ఈటల రాజేందర్‌ మరోమారు బడ్జెట్‌ను ప్రవేశపెడతారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చీఫ్‌ విప్‌గా దాస్యం వినయభాస్కర్‌ 

కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు

బీసీ గురుకులాల్లో కొలువులు

విష జ్వరాలకు  కేరాఫ్‌గా తెలంగాణ: లక్ష్మణ్‌

నా పేరు నరసింహన్‌

సాగునీటికి కత్తెర..

‘అసైన్డ్‌’  లెక్కేంటి?

కేబినెట్‌లోకి ఆరుగురు

విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్‌!

యాదాద్రి : కేసీఆర్‌ బొమ్మపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ముగిసిన టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం

ఈనాటి ముఖ్యాంశాలు

మురికి గుంతలో 48 గంటలుగా..

కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?

వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

గవర్నర్‌ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం

నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా