హనుమాన్‌ జయంతి ఏర్పాట్లపై సమీక్ష  

24 Mar, 2018 12:32 IST|Sakshi
  ఆలయ పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పీ 

   ఆలయ పరిసరాలు పరిశీలించిన ఎస్పీ

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 31న నిర్వహించే చిన్నజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ సునీల్‌దత్‌ శుక్రవారం సమీక్షించారు. ఆలయ ఈవో అమరేందర్, డీఎస్పీ భద్రయ్య, జగిత్యాల రూరల్‌ సీఐ శ్రీనివాసచౌదరి, మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్‌ హాజరయ్యారు. అంతకుముందు ఎస్పీ ఆలయం పరిసరాలు, క్యూలైన్, కోనేరు, కల్యాణకట్ట, సీతమ్మకన్నీటి గుంత, బేతాళస్వామి ఆలయం, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. దీక్షాపరులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాసశర్మ, ఎస్‌ఐ నీలం రవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు