బువ్వ తినగలమా...?!

13 Sep, 2015 03:44 IST|Sakshi
బువ్వ తినగలమా...?!

- రోజురోజుకు కొండెక్కుతున్న బియ్యం ధర
- క్వింటాల్‌కు రూ.350కి పైగా అప్
- బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు
చెన్నూర్ :
మార్కెట్‌లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొనాలంటేనే భయపడుతున్నారు. ఈ ఏడా ది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ వరి సాగు తగ్గిన నేపథ్యంలో మరికొద్ది నెలల్లో బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
 
ధరలు పైపైకి...
వారం వ్యవధిలో బీపీటీ సన్న రకం బియ్యం క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.350 వరకు పెరగగా, హెచ్‌ఎం టీ, జైశ్రీరాం రకం ధరలు రూ. 350 నుంచి 400 వరకు పెరిగారుు. దీనికి తోడు వంట నూనెలు, కూరగాయలే కాకుండా రోజూ వాడే ఉల్లిగడ్డల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు స్థాయిని దాటిపోయూయి.
 
సామాన్యులపై పెనుభారం...
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెరిగిన బియ్యం ధరలతో పెనుభారం పడుతోంది. రోజంతా పని చేస్తే రూ.200 కూడా గిట్టుబాటు కావడంలేదు. ఈ నేపథ్యం లో బియ్యం, ఉల్లితో పాటు నిత్యావసర వస్తువులు, కూ రగాయల ధరలు మండిపోతుండగా ప్రజలకు ఏం చే యూలో అర్థం కావడం లేదు.
 
తగ్గిన ఖరీఫ్ సాగు
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో జి ల్లాలో 50 శాతం వరి సాగు తగ్గిందని అంచనా. వర్షాలు లేని కారణంగా రబీ సాగు సైతం అంతంత మాత్రంగా నే ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో సాగు గణనీయంగా పడిపోరుు వచ్చే ఏడాది బియ్యం అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం కిలో రూ.45 ఉన్న సన్న రకం బియ్యం ధర మరింత పెరిగే అ వకాశముందని వ్యాపారులు అంటున్నారు. ఖరీఫ్‌లో వరి సాగు తగ్గింది. ఈ లెక్కన చూస్తే వచ్చే రోజుల్లో కిలో బియ్యం రూ.60కి చేరినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని వ్యాపారులు చెబుతున్నారు.
 
‘మధ్య తరగతి’కి కష్టమే...
బియ్యం ధరలు చూస్తే కన్నీరోస్తుంది. ఇలాగే ధరలు పెరుగుతే మధ్య తరగతి ప్రజలు బతకడం కష్టమే.  రోజంతా పని చేస్తే వచ్చే రూ. 200 ఎలా బతకడం? ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి.
- మారుపాక పోచం, ప్రైవేట్ ఉద్యోగి, కిష్టంపేట  
 
ప్రభుత్వం చొరవ చూపాలి..
బియ్యం ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టమే. ప్రజలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుంది. బియ్యం ధరలు పెరగడానికి గల కారణాలను ఆరా తీసి నియంత్రణకు ప్రభుత్వం చొరవ చూపాలి.
- గుర్రం శ్రీనివాస్, ఎల్‌ఐసీ ఏజెంట్, చెన్నూర్  
 
ఇప్పుడే ఇట్లా ఉంటే...
బియ్యం ధరలు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో వరి అన్నం పరమాన్నంగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. సామాన్యు ల ఇబ్బందులను పట్టించుకోకపోవడం లేదు.
 - సురేష్, సెల్ వ్యాపారి, చెన్నూర్

మరిన్ని వార్తలు