పంబారట్టు అదిరేట్టు!

7 Dec, 2014 02:05 IST|Sakshi

ఘనంగా అయ్యుప్ప సేవ
భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామి శరణుఘోషతో మార్మోగిన పట్టణం

 
నర్సంపేటలో పంబారట్టు అదిరేట్టుగా    కొనసాగింది.. అయ్యప్పస్వాముల బృందనృత్యాలు ఆకట్టుకున్నారుు.. పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగారుు.. మణికంఠుడిని రథంపై ఊరేగించారు.. వేల సంఖ్యలో స్వాములు, భక్తులు తరలిచ్చారు.. అయ్యప్ప ప్రతిమలకు చక్రస్నానాలు చేరుుంచారు..
 
నర్సంపేట : అయ్యప్ప శరణుఘోషతో పట్టణం మార్మోగింది. శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ కమిటీ బాధ్యులు శింగిరికొండ మాధవశంకర్, డీఎస్సార్ మూర్తి ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటలో పంబారట్టు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మనాభ నంబూద్రిస్వామి మంత్రోచ్చరణ నడుమ సుదర్శన్‌రెడ్డి అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఎత్తుకుని రథంపై ప్రతిష్టించి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభించారు. రథాన్ని పెద్ది నడిపారు. అయ్యప్ప మాలధారులు పులివేషాలు, బొమ్మాయుధాలు ధరించి పేటతుల్లి ఆడారు.

స్వామి వారికి చక్రస్నానం

రథం మాదన్నపేటకు చేరుకున్న తరువాత వివిధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి చక్రస్నానం చేయించారు. అనంతరం చెరువుకట్టపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప భక్తులతో పట్టణం కిక్కిరిసిసోయింది. రాత్రి అయ్యప్ప దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయు కమిటీ బాధ్యులు చంద్రశేఖర్, గోనెల రవీందర్, ఈశ్వరయ్యు, చిం తల నిరంజన్, సదానందం, భూ పతి లక్ష్మీనారాయుణ, దొడ్డ రవీందర్, గురుస్వావుులు  బాబురా వు, సంజీవరావు, పానుగంటి శ్రీని వాస్, యూదగిరి, అనిల్, నాగరాజు, అంకూస్, టీఆర్‌ఎస్ నాయుకులు రా రుుడి రవీందర్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, మోతె జైపాల్‌రెడ్డి, గుంటి కిషన్, పుట్టపాక కువూరస్వామి, సతీష్, అప్పాల సుదర్శన్, దార్ల రవూదేవి, రాయురాకుల సారంగపాణి, వుురళీ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు