సమాజ సేవలో రిక్షావాలా

4 Apr, 2018 09:37 IST|Sakshi
 రిక్షాపై పద్మావతి పుదుచ్చేరి 

భద్రాచలంఅర్బన్‌: సమాజ సేవే పరమార్థంగా ఎక్కడో కేరళలోని పాల్‌ఘడ్‌ జిల్లా లఖిడిలో పుట్టిన ‘పద్మావతి పుదుచ్చేరి’ అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ పలు రాష్ట్రాలు పర్యాటిస్తున్నాడు. మధర్‌ తెరిస్సా స్ఫూర్తితో సమాజ సేవే లక్ష్యంగా ఎంచుకోని తన పేరును ‘నిజం’గా మార్చుకున్నాడు. తండ్రి మరణించిన తరువాత శవంను తీసుకువెళ్లడానికి ఎవరు ముందుకు రాలేదు ఖర్మకాండలకు తన రిక్షాపైనే తీసుకు వెళ్లి నిర్వహించారు.

తాను ఎదురుకొన్న గడ్డు పరిస్థితులు నలుగుకు రాకూడదని తన సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు. తన రిక్షాలో ఉచితంగా ఎక్కించుకున్న వృద్ధులను, వికలాంగులను తమ గమ్య స్థానాల్లో దింపుతూ సాగిపోతున్న పుదుచ్చేరి మంగళవారం భద్రాచల పట్టణంకు చేరుకున్నాడు. కొన్ని ప్రాంతాల్లో దాతలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో అనాధ ఆశ్రమాలలోని పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, తినుభాండారాలు అందిస్తూ వారి పట్ల ఉడత భక్తి చాటుకుంటున్నాడు.   

మరిన్ని వార్తలు